Uttar Pradesh: శ్రీకృష్ణుడు రోజూ నా కలలోకి వస్తాడు: అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav Says Lord Krishna Comes to His Dream Every Single Night
  • మాదే అధికారం అని చెబుతున్నాడు
  • యోగి అన్నింట్లోనూ ఫెయిల్ అయ్యారు
  • ఆయన్ను ఎవరూ కాపాడలేరన్న ఎస్పీ చీఫ్
శ్రీకృష్ణుడు ప్రతిరోజూ తన కలలోకి వస్తాడని, తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ చెబుతున్నాడని యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు తన కలలోకి వచ్చి యోగి ఆదిత్యనాథ్ ను మధుర నియోజకవర్గం నుంచి బరిలోకి దింపమన్నాడంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజ్యసభ సభ్యుడు హరనాథ్ సింగ్ రాసిన లేఖకు కౌంటర్ గా అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘బాబా (యోగి ఆదిత్యనాథ్) విఫలమయ్యారు. ఎవరూ ఆయన్ను కాపాడలేరు. ప్రతి రోజు రాత్రి కృష్ణుడు నా కలలోకి వస్తాడు. యూపీలో అధికారం మాదేనంటూ చెబుతున్నాడు’’ అన్నారు అఖిలేశ్. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. కాగా, ప్రస్తుతం అఖిలేశ్ యాదవ్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆజాంగఢ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.
Uttar Pradesh
Akhilesh Yadav
Samajwadi Party
Lord Krishna

More Telugu News