New Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా

Delhi CM Arvind Kejriwal tested corona Positive
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సీఎం
  • స్వల్ప లక్షణాలు ఉండడంతో హోం ఐసోలేషన్‌లోకి
  • తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచన
  • ఎన్నికల ప్రచారానికి బ్రేక్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ఈ ఉదయం స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. తనకు వైరస్ సోకిందని తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని, ఐసోలేషన్‌లో ఉండడంతోపాటు టెస్టులు చేయించుకోవాలని కోరారు. కేజ్రీవాల్ కరోనా బారినపడడంతో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారానికి కొంతకాలం పాటు బ్రేక్ పడనుంది.

కాగా, ఢిల్లీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పాజిటివిటీ పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 4,099 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.46 శాతంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 6,288 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కేసులు ఈ స్థాయిలో పెరగడానికి ఒమిక్రాన్ వేరియంటే కారణమని భావిస్తున్నారు.
New Delhi
Arvind Kejriwal
Corona Virus

More Telugu News