Kalyandev: సంక్రాంతి బరిలో చిన్న సినిమాల సందడి!

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'సూపర్ మచ్చి'
  • గల్లా అశోక్ పరిచయంతో 'హీరో'
  • 'రౌడీ బాయ్స్' కూడా రంగంలోకి 
  • లైన్లో ఎమ్మెస్ రాజు సినిమా
Sankranthi Movies Update

నిజానికి ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు మాత్రమే అన్ని థియేటర్లను ఆక్రమిస్తాయని అనుకున్నారు. ఒకటి 'ఆర్ ఆర్ ఆర్' అయితే, మరొకటి 'రాధేశ్యామ్'. కానీ 'ఆర్ ఆర్ ఆర్' విడుదల తేదీని వాయిదా వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఒకే తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఒమిక్రాన్ కారణంగా అది కుదరడం లేదు.

'రాధే శ్యామ్' మాత్రం అదే డేట్ కి ఫిక్స్ అయ్యాడు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' పక్కకి తప్పుకోవడంతో చిన్న సినిమాలు చాలావరకూ రంగంలోకి దిగిపోయాయి. ఆ జాబితాలో కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' ఒకటిగా కనిపిస్తోంది. ఈ సినిమాతో కథానాయికగా రచిత రామ్ పరిచయమవుతోంది. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాను జనవరి 14వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఇక గల్లా అశోక్ హీరోగా రూపొందిన 'హీరో' .. ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న 'రౌడీ బాయ్స్' కూడా సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన '7 డేస్ 6 నైట్స్' కూడా సంక్రాంతికే విడుదలవుతోంది. ఇక మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి దిశగా కదులుతుండటం విశేషం.

More Telugu News