Dhanush: 'సార్' కోసం రంగంలోకి దిగిపోయిన ధనుశ్!

Sir Movie Update
  • కోలీవుడ్ లో వరుస సినిమాలు 
  • తెలుగులో నేరుగా చేస్తున్న ధనుశ్ 
  • దర్శకుడిగా వెంకీ అట్లూరి 
  • ఈ నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుశ్ స్థానం ప్రత్యేకం. అజిత్ .. విజయ్ వంటి సూపర్ స్టార్ హీరోల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుంటూ ఆయన తనదైన స్టైల్లో ముందుకు వెళుతున్నాడు. కథల్లోను .. పాత్రల్లోను వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. తమిళంలో వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడు.

తెలుగులో నేరుగా ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తెలుగులో 'సార్' అనీ .. తమిళంలో 'వాతి' అని ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతుండగా, సితార నాగవంశీ - త్రివిక్రమ్ శ్రీమతి సాయి సౌజన్య ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  

ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ధనుశ్ సరసన నాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. ఆల్రెడీ ఈ సుందరి 'బింబిసార' .. 'భీమ్లా నాయక్' సినిమాలు చేసింది .. అవి విడుదలైకి రెడీగా ఉన్నాయి.
Dhanush
Samyuktha Menen
Venky Atlury
Sir Movie

More Telugu News