CM Jagan: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

AP CM Jagan met PM Narendra Modi in Delhi
  • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్
  • ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు
  • మోదీతో సమావేశం తర్వాత సీతారామన్ తో భేటీ
  • రేపు నితిన్ గడ్కరీతో సమావేశం 

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన ప్రధానితో చర్చించనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. అంతకుముందు, ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ కు వైసీపీ ఎంపీలు, పార్టీ శ్రేణుల నుంచి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కాగా, రేపు ఉదయం సీఎం జగన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు.

  • Loading...

More Telugu News