Chandrababu: ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనపై చంద్రబాబు స్పందన

Chandrababu response on NTR statue vandalisation
  • విగ్రహాలను ధ్వంసం చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నారు
  • రోజురోజుకు రాజకీయాలు దిగజారిపోతున్నాయి
  • విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ దుండగులు ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నారని తెలిసి తాను దిగ్భ్రాంతి చెందానని, ఎంతో బాధ పడ్డానని తెలిపారు. తాడికొండలో పోలీస్ స్టేషన్ ఎదుటే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని... కానీ ఈ రాజకీయ హింసను అరికట్టేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు. రోజురోజుకు రాజకీయాలు దిగజారిపోతుండటం బాధాకరమని అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన ఆయన కీర్తిని పాడుచేయలేరని అన్నారు.
Chandrababu
Telugudesam
NTR
Statue

More Telugu News