Hero Nani: శివపార్వతి థియేటర్ అగ్నిప్రమాదానికి గురికావడం బాధాకరం: హీరో నాని

Hero Nani responds to fire accident in Shiva Parvathi theater
  • కూకట్ పల్లిలో ఘటన
  • ఇదే థియేటర్లో 'టక్కరి దొంగ' చిత్రం చూశానన్న నాని 
  • ఎవరూ గాయపడనందుకు సంతోషం అంటూ ట్వీట్
హైదరాబాదు కూకట్ పల్లిలోని శివపార్వతి థియేటర్ లో గత అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ హీరో నాని విచారం వ్యక్తం చేశారు. శివపార్వతి థియేటర్ అగ్నిప్రమాదానికి గురికావడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. అప్పట్లో సినిమా పిచ్చితో ఇదే థియేటర్లో 'టక్కరి దొంగ' చిత్రం చూడడం గుర్తుకొస్తోందని తెలిపారు. అయితే ఎవరూ గాయపడనందుకు సంతోషం అని ట్వీట్ చేశారు. కాగా, శివపార్వతి థియేటర్లో 'శ్యామ్ సింగరాయ్' చిత్రం ప్రదర్శిస్తున్న సమయంలోనే అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Hero Nani
Fire Accident
Shiva Parvathi Theater
Kukatpalli
Hyderabad
Tollywood

More Telugu News