Chiranjeevi: పవన్ కల్యాణ్ కొన్ని అంశాల్లో స్పందించడం కరెక్టే అనిపిస్తుంది: చిరంజీవి

Chiranjeevi says sometimes Pawan Kalyan attitude was correct
  • ఆక్సిజన్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి
  • ఇతరులకు మంచి చేయడమే తన స్వభావమని వెల్లడి
  • కొందరు వాళ్ల బుద్ధి చూపిస్తుంటారని విమర్శలు
  • అభిమానులే తన స్పందన అని స్పష్టీకరణ
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు 'చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవతలి వ్యక్తులు వాళ్ల బుద్ధి చూపిస్తుంటారని, కానీ తన స్వభావం మాత్రం ఇతరులకు మంచి చేయడమేనని స్పష్టం చేశారు. తాను ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు ముందుకు వచ్చారంటే, తన స్పందన వారిలో వ్యక్తమైనట్టుగా భావిస్తానని పేర్కొన్నారు. అభిమానులు స్పందించడం తనకు ఎనలేని బలం అని చిరంజీవి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తన సోదరుడు పవన్ కల్యాణ్ ప్రస్తావనను కూడా తీసుకువచ్చారు. కొన్ని అంశాల్లో పవన్ కల్యాణ్ స్పందించడం చూస్తుంటే సమంజసంగానే అనిపిస్తుందని వెల్లడించారు. పవన్ కల్యాణ్ న్యాయం కోసమే పోరాడతాడని, న్యాయం కోసమే వాదిస్తాడని కొనియాడారు. అదే న్యాయం కోసం తాను కూడా పోరాడతానని, అయితే సమయం తీసుకుంటానని వివరించారు. మన చిత్తశుద్ధి, నిజాయతీ, సంయమనం విజయాలు అందిస్తాయని చిరంజీవి పేర్కొన్నారు.
Chiranjeevi
Pawan Kalyan
Attitude
Oxygen Bank
Tollywood

More Telugu News