passes away: ప్రముఖ సినీ ద‌ర్శ‌కుడు పి.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి క‌న్నుమూత‌

cs reddy passes away
  • అనారోగ్య కార‌ణాల‌తో మృతి
  • ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ చిత్రాల‌కు దర్శకత్వం
  • కృష్ణ‌తో ఎక్కువ సినిమాలు చేసిన పీసీ రెడ్డి 
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోల చిత్రాల‌కు దర్శకత్వం వ‌హించిన‌  పి.చంద్రశేఖర్‌రెడ్డి (86) అనారోగ్య కార‌ణాల‌తో కన్నుమూశారు. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు చెన్నైలో ఆయ‌న మృతి చెందార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న త‌న కెరీర్‌లో సుమారు 80 సినిమాల‌కు దర్శకత్వం వహించారు.

ఎక్కువగా సూపర్‌స్టార్‌ కృష్ణతో సినిమాలు చేశారు. మానవుడు దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు, బడి పంతులు, విచిత్ర దాంపత్యం, రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి, పాడిపంటలు వంటి సినిమాల‌కు ఆయ‌న‌ దర్శకత్వం వహించారు. ఆయన మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన రోజుల‌ను గుర్తు చేసుకుంటున్నారు.
passes away
Tollywood

More Telugu News