Nara Lokesh: మాచర్ల నియోజకవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైసీపీ నేతపై చర్యలు తీసుకోవాలి: లోకేశ్

Lokesh shares a video of NTR Statue vandalizing in Durgi
  • ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారన్న లోకేశ్
  • మహనీయుల విగ్రహాలు కూలగొడుతున్నారని ఆగ్రహం
  • దుర్గి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడి
వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు కూలగొడుతున్నారని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేత శెట్టిపల్లి కోటేశ్వరరావు ధ్వంసం చేశాడని లోకేశ్ వెల్లడించారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైసీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Nara Lokesh
NTR Statue
Durgi
YSRCP
Andhra Pradesh

More Telugu News