mental disorders: కరోనాతో పెరుగుతున్న మానసిక సమస్యల బాధితులు

  • కరోనాకు ముందు 25 శాతం మందిలో మనో వ్యాకులత
  • మహమ్మారి వచ్చిన తర్వాత పెరిగిన బాధితులు
  • బ్రిటన్ వైద్య పరిశోధకుడు శాన్ ఎలెంజ్
mental disorders after covid pandemic rises

కరోనా ఇన్ఫెక్షన్ తో శరీరంలోని కీలకమైన ఊపిరితిత్తులు, గుండె తదితర ముఖ్య అవయవాలపై ప్రభావం పడుతుండడాన్ని చూస్తున్నాం. మనో వ్యాకులత కూడా పెరిగిపోతున్నట్టు బ్రిటన్ కు చెందిన వైద్య పరిశోధకుడు ఎలెనా శాంజ్ తెలిపారు. కరోనా రాక ముందే ప్రపంచ జనాభాలో 25 శాతం మంది మానసిక పరమైన సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పారు. కరోనా వచ్చిన తర్వాత ఈ సమస్యలు మరింత ఎక్కువ మందిలో కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి బారిన పడినవారే అని కాదు.. కరోనా వల్ల పాఠశాలలు మూతపడిపోవడం. ఆన్ లైన్ క్లాసులు, ఇంటికే పరిమితం కావడం, ఇతర పిల్లలతో కలసి ఆడుకునే అవకాశాల్లేక పోవడం వల్ల చిన్నారులు సైతం మానసికపరమైన ఇబ్బందులు పడతున్నట్టు శాంజ్ వెల్లడించారు.

కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాల కోతల వంటివి చూశాం. కొన్ని రంగాల్లో డిమాండ్ పై గట్టి ప్రభావమే పడింది. కరోనా మరణాలు కూడా చూసిన తర్వాత.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నెలకొన్నట్టు శాంజ్ పేర్కొన్నారు.

More Telugu News