car sales: కరోనా కాలంలో రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు

Beating all bumps car sales grow 27percent in 2021
  • 30 లక్షలు దాటిన విక్రయాలు
  • మొదటి రెండు స్థానాల్లో మారుతి, హ్యుందాయ్
  • ప్రతికూలతలున్నా సానుకూల పనితీరు

కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడంతో కార్ల కొనుగోలును వాయిదా వేసుకున్న వారున్నారు. కానీ, అదే కాలంలో కార్ల కొనుగోలుకు మొగ్గు చూపించిన వారు కూడా గణనీయంగానే ఉన్నట్టు గణాంకాలు చూస్తే తెలుస్తోంది. 2021 మార్చి నుంచి మే వరకు రెండో విడత కరోనా విలయతాండవం చూశాం. అయినా కానీ సంవత్సరం మొత్తం మీద కార్ల విక్రయాలు ఆశావహంగానే ఉన్నాయి.

2021లో కార్ల విక్రయాలు 27 శాతం పెరిగాయి. కీలకమైన 30 లక్షలను దాటాయి. చరిత్రలో ఒక ఏడాదిలో 30 లక్షల కార్లు అమ్ముడుపోవడం ఇది మూడోసారి. 2017లో 32.3 లక్షల యూనిట్లు, 2018లో 33.95 లక్షల యూనిట్ల చొప్పున అమ్ముడయ్యాయి.

సెమీకండక్టర్ల (చిప్లు) కొరత, ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం వంటి సమస్యలను కంపెనీలు ఎదుర్కొన్నాయి. ధరలను కూడా పలు మార్లు పెంచాయి. అయినా కానీ విక్రయాలను పెంచుకోగలిగాయంటే.. వినియోగదారుల నుంచి ఉన్న బలమైన డిమాండే కారణం.

కార్ల కంపెనీలు 2021లో తమ డీలర్లకు 30.82 లక్షల కార్లను పంపించాయి. ఈ గణాంకాలను విక్రయాలుగా పరిగణిస్తుంటారు. 2020లో ఇలా పంపించింది 24.33 లక్షల యూనిట్లు మాత్రమే. మారుతి సుజుకీ 13.65 లక్షలు, హ్యుందాయ్ 5 లక్షల యూనిట్ల చొప్పున విక్రయాలను నమోదు చేశాయి.

  • Loading...

More Telugu News