దేశంలో భారీగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు

02-01-2022 Sun 09:55
  • నిన్న 27,553 క‌రోనా కేసులు
  • 284 మంది క‌రోనాతో మృతి
  • 9,249 మంది డిశ్చార్జ్
  • ఒమిక్రాన్ కేసులు మొత్తం 1,525
corona bulletin in inida
దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. నిన్న 27,553 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే, నిన్న‌ 284 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా నుంచి 9,249 మంది కోలుకున్నారు.

దేశంలో ప్ర‌స్తుతం క‌రోనాకు 1,22,801 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మొన్న‌ ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 1,431గా ఉండ‌గా, ఇప్పుడు 1,525కు పెరిగింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.