Allu Arjun: హిందీలో 50 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన 'పుష్ప'

  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
  • హిందీలోనూ అదే తీరు
  • ఓవర్సీస్ లోను తగ్గని జోరు  
  • బన్నీ మార్కెట్ మరింత పెరిగినట్టే
Pushpa movie update

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' సినిమా క్రితం నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. తొలి రోజున ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో వసూళ్లపై ఆ ప్రభావం పడుతుందని అంతా అనుకున్నారు. కానీ బన్నీ టీమ్ సక్సెస్ పార్టీలు నిర్వహించి ఒక్కసారిగా టాక్ మార్చేశారు.

అప్పటి నుంచి ఈ సినిమా వసూళ్ల పరంగా దూకుడు చూపుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. హిందీ వెర్షన్ లో సినిమా 15 రోజలలోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. హిందీలోకి అనువాదమైన బన్నీ సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ ఉంది.

అలా అక్కడి ప్రేక్షకులకు బన్నీ బాగా తెలుసు. అందువల్లనే ఆయన సినిమా చాలా ఫాస్టుగా జనంలోకి వెళ్లగలిగిందని చెప్పుకుంటున్నారు. మహారాష్ట్ర .. గుజరాత్ లలో కరోనా ప్రభావం లేకపోతే ఈ వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు..

More Telugu News