TSRTC: తెలంగాణలో చిన్నారులకు శాశ్వతంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ చర్యలు!

  • బస్ భవన్ లో కొత్త సంవత్సర వేడుకలు
  • హాజరైన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్
  • కేక్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన బాజిరెడ్డి
Telangana RTC plans free travelling  for children

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. అదేంటంటే... కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని జనవరి 1 నాడు 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర అంశం వెల్లడించారు. తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచిత ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

కొత్త సంవత్సరాది వేడుకలను నేడు హైదరాబాద్ బస్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో పాటు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నారులకు శాశ్వత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కుతారని వివరించారు. తద్వారా ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్ ఆక్యుపెన్సీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

More Telugu News