Sudheer Babu: 'ఆ అమ్మాయి..' ఫస్టులుక్ మీరు చూడాల్సిందే!

Aa Ammayi Gurinchi Meeku Cheppali First look Released
  • ఇంద్రగంటి నుంచి ఎమోషనల్ లవ్ స్టోరీ
  • సుధీర్ బాబు జోడీగా కృతిశెట్టి
  • సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్
  • ఈ ఏడాదిలోనే విడుదల  
ఇప్పుడు కొత్త ప్రాజెక్టులలో కృతిశెట్టి ఎక్కువగా కనిపిస్తోంది. యూత్ లో ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'ఉప్పెన' నుంచి కుర్రాళ్లంతా కృతిశెట్టి గ్లామర్ కి అభిమానులుగా .. ఆరాధకులుగా మారిపోయారు. వరుస అవకాశాలను ఆమె అందుకుంటూ .. అల్లుకుంటూ దూసుకుపోతోంది. అలా సుధీర్ బాబు జోడీగా ఆమె 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా చేస్తోంది.

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ కానుకగా ఫస్టులుక్ ను వదిలారు. బ్లాక్ అండ్ వైట్ లో వదిలిన ఈ రొమాంటిక్ లుక్ యూత్ మనసులకు పట్టేసేదిలా ఉంది. కృతిశెట్టి మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. ఇంత అందంగా ఆమెను చూపించిన తరువాత ఆ అమ్మాయి గురించి హీరోగారు ఎంతసేపు చెప్పినా వినాలనిపించడం ఖాయం.

మైత్రీ మూవీ మేకర్స్ - బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం, సిరివెన్నెల - రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమాతో పాటు కృతిశెట్టి చేసిన 'బంగార్రాజు' .. 'మాచర్ల నియోజక వర్గం' .. రామ్ జోడీగా చేసిన మూవీ ఈ ఏడాదిలోనే రానున్నాయి..
Sudheer Babu
Kruthi Shetty
Indraganti Mohanakrishna Movie

More Telugu News