Sampoornesh Babu: సంపూ హీరోగా 'మిస్టర్ బెగ్గర్'

Sampoornesh Babu New Movie is Mr Begger
  • సంపూ హీరోగా 'మిస్టర్ బెగ్గర్'
  • హాస్య ప్రధానంగా సాగే కథ 
  • దర్శకుడిగా జనార్దన్ పరిచయం 
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్  

సంపూర్ణేశ్ బాబు హాస్యరస ప్రధానమైన కథలను వరుసగా చేస్తూ వస్తున్నాడు. 'కొబ్బరి మట్ట' సినిమాతో సక్సెస్ ను అందుకున్న ఆయన, ఇటీవల వచ్చిన 'క్యాలీ ఫ్లవర్' సినిమా ద్వారా తనదైన స్టయిల్లో ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు. ఇక ఈ ఏడాది కూడా తనదైన మార్కుతో నాన్ స్టాప్ గా నవ్వించడానికి ఆయన రెడీ అవుతున్నాడు.

విభిన్నమైన కథాకథనాలతో కూడిన ఒక సినిమాను గురురాజ్ - కార్తీక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా జనార్దన్ పరిచయమవుతున్నాడు. రోహిత్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి, 'మిస్టర్ బెగ్గర్' అనే టైటిల్ ను సెట్ చేశారు. తాజాగా ఈ టైటిల్ తో కూడిన సంపూ ఫస్టు లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

'మిస్టర్ బెగ్గర్' గా కూడా సంపూ చాలా స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. 'వీడు చిల్లరడగడు' అనే క్యాప్షన్ చూస్తేనే ఈ సినిమా, నవ్వుల రసంతో సాగిపోతుందనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళుతోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు..

  • Loading...

More Telugu News