Children: పిల్లల వ్యాక్సిన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..?

  • 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్
  • జనవరి 3 నుంచి టీకా వేసే కార్యక్రమం ప్రారంభం
  • కోవిన్ పోర్టల్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది
Registration Begins For Covid Vaccine For Teens Aged between 15 to 18

మన దేశంలో పిల్లల కరోనా వ్యాక్సిన్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమయింది. 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు సోమవారం (జనవరి 3) నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా పిల్లలకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ను ప్రారంభించామని చెప్పారు. అర్హత ఉన్న పిల్లల పేర్లను వారి కుటుంబసభ్యులు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని కోరారు.

రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ:

  • కోవిన్ పోర్టల్ లోకి వెళ్లి ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. 
  • ఒకే నంబర్ పై నాలుగు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అంటే తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ పై పిల్లల పేర్లను కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
  • ఓటీపీ ద్వారా ఫోన్ నంబర్ ను ధ్రువీకరించిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.  
  • రిజిస్ట్రేషన్ పేజ్ లో పిల్లల పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత టీకా ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నారో ఆ తేదీని ఎంటర్ చేయాలి.
  • కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోలేని వారు దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.  

More Telugu News