Faisal Patel: బాలీవుడ్ భామ అమీషా పటేల్ కు పెళ్లి ప్రపోజల్ చేసిన కాంగ్రెస్ నేత తనయుడు

Faisal Patel proposes Ameesha Patel
  • తెలుగులో బద్రి సినిమాలో నటించిన అమీషా
  • ఇంకా పెళ్లి చేసుకోని వైనం
  • అహ్మద్ పటేల్ తనయుడితో లవ్ అఫైర్ అంటూ ప్రచారం
  • ఫైజల్ పుట్టినరోజుకు స్పెషల్ గ్రీటింగ్స్ చెప్పిన అమీషా
తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన 'బద్రి' చిత్రంలో 'సరయు'గా అభిమానుల మది దోచిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. తాజాగా, కాంగ్రెస్ పార్టీ దివంగత సీనియర్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్... అమీషా పటేల్ కు పెళ్లి ప్రపోజల్ చేశాడు. అయితే కొద్దిసేపట్లోనే తాను చేసిన ట్వీట్ ను ఫైజల్ తొలగించాడు.

అమీషా, ఫైజల్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ మధ్య ప్రేమ బంధం ఉన్నట్టు వీరిద్దరిలో ఎవరూ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. అయితే ఫైజల్ పుట్టినరోజు సందర్భంగా వారి ప్రేమపై ప్రచారానికి బలం చేకూర్చే ఘటన జరిగింది. ఫైజల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమీషా పటేల్ కూడా అతడికి శుభాకాంక్షలు తెలిపింది.

తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలతో కూడిన కొలాజ్ ఫ్రేమ్ ను పోస్టు చేసింది. "హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ ఫైజల్ పటేల్.... లవ్యూ" అంటూ పేర్కొంది. అందుకు ఫైజల్ పటేల్ స్పందిస్తూ... "థాంక్యూ అమీషా పటేల్... అందరి సమక్షంలో అడుగుతున్నాను... నన్ను పెళ్లి చేసుకుంటావా?" అంటూ ట్వీట్ చేశాడు. దాంతో నెటిజన్లు ఓ రేంజిలో తమ స్పందనలు వెలిబుచ్చారు. అయితే, కాసేపటి తర్వాత ఫైజల్ తన ట్వీట్ ను డిలీట్ చేయడంతో నెటిజన్ల ఉత్సాహానికి తెరపడింది.
Faisal Patel
Ameesha Patel
Proposal
Ahmed Patel
Congress

More Telugu News