పీఎం కిసాన్ పదో విడత నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ

01-01-2022 Sat 16:03
  • రైతులకు లబ్ది చేకూర్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం
  • ఏటా రైతులకు మూడుసార్లు రూ.2 వేల చొప్పున రూ.6 వేలు
  • తాజాగా 10 కోట్ల మంది రైతులకు లబ్ది
  • రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా నిధి విడుదల
PM Modi releases Kisan Samman Nidhi funds
రైతులకు లబ్ది చేకూర్చేందుకు ఉద్దేశించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా పదో విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు విడుదల చేశారు. ఒక్క క్లిక్ తో 10 కోట్లకు పైగా రైతుల ఖాతాలో రూ.21 వేల కోట్లు జమ చేశారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో మూడుసార్లు చొప్పున మొత్తం రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా నిధులు బదిలీ చేసిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2018 నుంచి ఇప్పటివరకు రూ.1.61 లక్షల కోట్ల మేర రైతులకు సాయం అందించామని అన్నారు. అంతేకాదు, 351 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.14 కోట్ల నిధిని కూడా ఇవాళ విడుదల చేశారు. ఈ పథకం కింద 1.24 లక్షల మందికి పైగా రైతులకు లబ్ది చేకూరనుంది.