Radhe Shyam: 'రాధేశ్యామ్' విడుదల వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన చిత్రబృందం

UV Creations condemns Radheshyam postponement news
  • దేశంలో మళ్లీ కరోనా తీవ్రత
  • పెరుగుతున్న రోజువారీ కేసులు
  • పెద్ద సినిమాల విడుదల వాయిదా అంటూ ప్రచారం
  • సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్
దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వాయిదా పడనున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

దీనిపై రాధేశ్యామ్ చిత్రబృందం స్పందించింది. విడుదల వాయిదా అంటూ వస్తున్న పుకార్లను ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ముందు ప్రకటించినట్టుగా ఈ నెల 14న రాధేశ్యామ్ విడుదల అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ స్పష్టం చేసింది. రాధేశ్యామ్ విడుదల వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభాస్ అభిమానులకు సూచించింది.

రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకున్న ఈ పీరియాడిక్ చిత్రానికి రాధాకృష్ణకుమార్ దర్శకుడు.
Radhe Shyam
UV Creations
Release
Sankranthi
Prabhas
Pooja Hegde
Tollywood

More Telugu News