Team India: భార్య అనుష్క.. టీమ్ మేట్స్ తో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న కోహ్లీ.. ఫొటోలివిగో!

kohli celebrated new year with wife anushka sharma and team mates in centurion
  • సెంచూరియన్ లో వేడుక చేసుకున్న జట్టు
  • ట్విట్టర్ లో ఫొటోలు షేర్ చేసిన కోహ్లీ
  • పిల్లల మాదిరి జట్టు సభ్యుల్లో కలిసిపోయిన ద్రావిడ్
భార్య అనుష్క శర్మ, టీమ్ మేట్స్ తో విరాట్ కోహ్లీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నాడు. సౌత్ ఆఫ్రికాలోని సెంచూరియన్ లో అంతా కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వేడుకలకు సంబంధించిన ఫొటోలను విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రార్థిస్తున్నానంటూ కామెంట్ పెట్టాడు. తమ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ అందరివెంట ఉంటాయన్నాడు. లూజుగా ఉన్న వైట్ టీ షర్టు వేసుకుని కోహ్లీ సెలబ్రేషన్ లో పాల్గొన్నాడు.

జట్టుతో పాటు సపోర్ట్ స్టాఫ్, కోచ్ రాహుల్ ద్రావిడ్ లు కూడా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ద్రావిడ్ పిల్లల మాదిరి జట్టు ఆటగాళ్లలో కలిసిపోయాడు. వారితోపాటే కింద కూర్చుని సందడి చేశాడు. ఇక, అనుష్క శర్మ కేక్ కట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. 2021 తమకు ఎంతో ప్రత్యేకమైన సంవత్సరమని ఆమె పేర్కొంది. గత ఏడాది జనవరిలోనే వారికి వామిక పుట్టిన సంగతి తెలిసిందే. ఆమె జననాన్ని గుర్తు చేసుకుంటూ అనుష్క పోస్ట్ పెట్టింది.

Team India
Virat Kohli
Anushka Sharma
Rahul Dravid

More Telugu News