దీప్తి సునయనతో బ్రేకప్ పై షణ్ముఖ్ స్పందన

01-01-2022 Sat 14:41
  • బ్రేకప్ నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయన్న షణ్ముఖ్
  • దీప్తి సంతోషంగా ఉండాలని వ్యాఖ్య
  • ఒకరికొకరం సపోర్ట్ గా ఉంటామన్న షణ్ముఖ్
Shanmukh response on breakup with Deepthi Sunaina
బిగ్ బాస్ కంటెస్టెంట్లు దీప్తి సునయన, షణ్ముఖ్ లు తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. తమ ఇద్దరి దారులు వేరని... పరస్పర అంగీకారంతోనే ఇద్దరం విడిపోతున్నామని ఇన్స్టాలో దీప్తి సునయన సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో తమ బ్రేకప్ పై షణ్ముఖ్ స్పందించాడు.

'ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయి. ఆమె ఇప్పటి వరకు చాలా ఎదుర్కొంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. మా దారులు వేరైనా ఒకరికొకరం సపోర్ట్ గా ఉంటాం. నేను మంచి వ్యక్తిగా ఎదిగేందుకు గత ఐదేళ్లుగా నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ దీపు' అని ఇన్స్టాలో కామెంట్ పెట్టాడు.