Ayyanna Patrudu: నమ్మి ఓటేసిన అవ్వాతాతలను నిండా ముంచాడు: సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు విమర్శలు

Ayyanna Patrudu fires on CM Jagan over pension
  • పెన్షన్ రూ.250 పెంచిన వైసీపీ సర్కారు
  • పెన్షన్ నేటి నుంచి రూ.2,500 
  • తీవ్రంగా స్పందించిన అయ్యన్నపాత్రుడు
  • జగన్ మోసపు రెడ్డి అంటూ వ్యాఖ్యలు
ఏపీలో నేడు పెన్షన్ పెంపుదల చేసిన సంగతి తెలిసిందే. పెంచిన మొత్తం రూ.250తో కలిపి ఇవాళ్లి నుంచి రూ.2,500 అందించనున్నారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. నమ్మి ఓటేసిన అవ్వాతాతలను జగన్ మోసపు రెడ్డి నిండా ముంచాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పెన్షన్ రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ఈ 32 నెలల కాలంలో పెంచింది రూ.250 మాత్రమేనని విమర్శించారు. ప్రజాధనాన్నే కాదు, నిరుపేదలను కూడా దోచుకుంటున్న దోపిడీదొంగ జగన్ అని అభివర్ణించారు. ఏ1 జగన్ 60 లక్షల మంది పింఛనుదారులలో ఒక్కొక్కరి నుంచి రూ.750 చొప్పున ఇప్పటిదాకా రూ.14,400 కోట్లు కొట్టేశాడని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

ఏ ఆసరా లేని అవ్వాతాతలను, వితంతువులను, దివ్యాంగులను ఈ నూతన సంవత్సరంలోనైనా మోసగించకుండా జగన్ కు మంచి బుద్ధి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
Ayyanna Patrudu
CM Jagan
Pension
YCP Govt

More Telugu News