Stalin: వర్షం పడుతుందనే విషయాన్ని వాతావరణశాఖ అంచనా వేయలేకపోయింది: తమిళనాడు సీఎం స్టాలిన్ 

Weather department unable to predict heavy rains says  Stalin
  • మొన్న చెన్నైలో భారీ వర్షం
  • పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం
  • వాతావరణశాఖను అప్ గ్రేడ్ చేస్తామన్న స్టాలిన్
చెన్నైలోని పలు ప్రాంతాల్లో మొన్న 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ... వర్షం పడుతుందనే విషయాన్ని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేస్తుందని... అయితే ఈ వర్షం గురించి ఎలాంటి హెచ్చరికలు చేయలేదని చెప్పారు.

నీట మునిగిన ప్రాంతాలను స్టాలిన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలను వాతావరణశాఖ అంచనా వేయలేకపోయిందని చెప్పారు. వాతావరణశాఖ సిస్టమ్ ను కేంద్ర ప్రభుత్వంతో కలిసి అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. వర్షం వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటామని చెప్పారు.
Stalin
Chennai
Rains

More Telugu News