numaish: నేటి నుంచి హైదరాబాదులో 45 రోజుల పాటు అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ సందడి

Mask Must At Numaish Or Cough Up 1000 Fine
  • ఫిబ్రవరి 15న ముగింపు
  • సందర్శకులు విధిగా మాస్క్ పెట్టుకోవాలి
  • లేదంటే రూ.1,000 ఫైన్ విధిస్తామన్న పోలీసులు
  • కొలువుదీరిన 1,600 స్టాళ్లు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ‘నుమాయిష్’ ఎగ్జిబిషన్ నేడు ఆరంభమై ఫిబ్రవరి 15 వరకు సందర్శకులకు కనువిందు చేయనుంది. అఖిల భారత పారిశ్రామిక ఎగ్జిబిషన్ (ఏఐఐఈ) సొసైటీ దీన్ని ఏటా నిర్వహిస్తుంటుంది. కరోనా కారణంగా గతేడాది ప్రదర్శనకు అనుమతించలేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేస్తుంటారు.

ఈ ఏడాది కరోనా ఉన్నప్పటికీ ఎగ్జిబిషన్ నిర్వహణకు సర్కారు నుంచి అనుమతి లభించింది. 2,500 స్టాళ్ల ఏర్పాటుకు వీలున్నా, 1,600 స్టాళ్ల ఏర్పాటుకు మాత్రమే లైసెన్స్ లు జారీ చేసినట్టు సొసైటీ కార్యదర్శి ఆదిత్య తెలిపారు. టికెట్ ధరను పెంచలేదని, రూ.30గానే కొనసాగుతుందని చెప్పారు.

కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని సెంట్రల్ జోన్ డీఎస్పీ పి.విశ్వప్రసాద్ తెలిపారు. ఎగ్జిబిషన్ కు వచ్చే ప్రతీ ఒక్కరికీ మాస్కు తప్పనిసరి అని చెప్పారు. ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే రూ.1,000 ఫైన్ విధిస్తామని స్పష్టం చేశారు.
numaish
nampally exibition
mask

More Telugu News