మళ్లీ రంగంలోకి దిగుతున్న రామ్!

01-01-2022 Sat 11:51
  • రామ్ తో లింగుసామి మూవీ 
  • మాస్ కంటెంట్ తో సాగే సినిమా 
  • కథానాయికగా కృతిశెట్టి 
  • ఈ నెల 5 నుంచి తాజా షెడ్యూల్
Ram new movie schedule starts from Jan 5th
రామ్ హీరోగా దర్శకుడు లింగుసామి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. కెరియర్ పరంగా రామ్ కి ఇది 19వ సినిమా. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. షూటింగు జరుగుతున్న సమయంలో పెద్దగా అప్ డేట్స్ కూడా ఇవ్వలేదు. తాజాగా ఈ రోజున మాత్రం న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఒక అప్ డేట్ ఇచ్చారు.

ఈ సినిమా తాజా షెడ్యూల్ ను ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుపెడుతున్నట్టుగా ప్రకటించారు. 4 నెలల తరువాత మళ్లీ సెట్స్ పైకి వస్తున్నట్టుగా చెప్పారు. ఇందులో రామ్ జోడీగా కృతిశెట్టిని తీసుకున్నారు. ఇది మాస్ యాక్షన్ మూవీగానే రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది. తమిళంలో లింగుసామికి మాస్ డైరెక్టర్ గానే ఒక ముద్ర ఉంది.

తమిళంలో ఆయన ఇంతకుముందు సూర్య .. కార్తి .. విశాల్ .. విక్రమ్ .. వంటివారితో చేసిన సినిమాలు మాస్ కంటెంట్ తో కూడినవే. అందువలన ఈ సినిమా కూడా ఆ జాబితాకు చెందినదిగానే చెప్పుకోవాలి. 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తో మాస్ మార్కులు తెచ్చుకున్న రామ్ కూడా ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు..