Deepthi Sunaina: విడిపోయిన 'బిగ్ బాస్' జంట దీప్తి సునయన, షణ్ముఖ్

Deepthi Sunaina breaks up with Shanmukh
  • పరస్పర అంగీకారంతో విడిపోయామన్న సునయన
  • ఇద్దరి దారులు వేరనే విషయం తెలుసుకున్నామని వ్యాఖ్య
  • తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని విన్నపం
బిగ్ బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్లు దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్ చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ 5 షో సందర్భంగా సిరితో షణ్ముఖ్ బాగా కనెక్ట్ అయ్యాడు. హగ్గులు, ముద్దులు వరకు వీరి వ్యవహారం వెళ్లింది. సిరి తల్లి హెచ్చరించినప్పటికీ వీరి పద్ధతి మారలేదు. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ కు సునయన బ్రేకప్ చెప్పింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

తాను, షణ్ముఖ్ ఇద్దరం మాట్లాడుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నామని సునయన తెలిపింది. ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయామని చెప్పింది. గత ఐదేళ్లుగా తాము సంతోషంగా ఉన్నామని తెలిపింది. చివరకు మీరు కోరుకున్నట్టే నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. కలిసి ఉండటానికి ఇద్దరం ఎంతో ప్రయత్నించామని, అయితే జీవితానికి ఏవి అవసరమో వాటిని విస్మరించామని తెలిపింది.

తమ ఇద్దరి దారులు వేరనే విషయాన్ని తెలుసుకున్నామని... అందుకే ఇక్కడితోనే ఆగిపోకుండా ముందుకు సాగాలని భావించామని చెప్పింది. తమ బ్రేకప్ సోషల్ మీడియాలో కనిపించినంత ఈజీ కాదని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఇద్దరి ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నామని చెప్పింది.
Deepthi Sunaina
Shanmukh
Bigg Boss
Breakup

More Telugu News