corona vaccine dose: 18 ఏళ్లు నిండిన ప్రజలందరికీ కరోనా రెండు డోసులు వేసిన ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్

over 90 percent of the target population has received one dose
  • దేశవ్యాప్తంగా 90 శాతం మంది వయోజనులకు రెండు డోసులు
  • 64 శాతం మందికి ఒక్క డోసు  
  • నెరవేరని కేంద్ర సర్కారు లక్ష్యం
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన జనాభాలో 90 శాతం మందికి కరోనా రక్షక టీకాలు ఇవ్వడం పూర్తయింది. 2021 డిసెంబర్ 31 రాత్రి 7 గంటల వరకు టీకాల సమాచారాన్ని సర్కారు విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే తన వయోజన జనాభా మొత్తానికి రెండు డోసుల లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. అతి తక్కువగా పంజాబ్ రాష్ట్రంలో 40 శాతం మందికే రెండు డోసులు ఇచ్చారు. తెలంగాణ నూరు శాతం ఒక్కడోసు లక్ష్యాన్ని సాధించింది.

145 కోట్ల టీకాలను ప్రజలకు ఇవ్వగా.. రాష్ట్రాల వద్ద శుక్రవారం నాటికి 16.9 కోట్ల టీకా డోసులు మిగిలి ఉన్నాయి. సిరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ టీకా 128.9 కోట్ల డోసులను సరఫరా చేసింది. కోవాగ్జిన్ 15.7 కోట్ల టీకా డోసులను అందించింది. మిగిలినవి స్పుత్నిక్ టీకాలు.

ఈ నెల 3 నుంచి 12 ఏళ్లు నిండిన పిల్లలకు కూడా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్, క్యాడిలాకు చెందిన జైకోవ్ డీ, సిరమ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కోవోవ్యాక్స్ లకు ప్రభుత్వం అనుమతించింది. ముందుగా భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాలే చిన్నారులకు అందుబాటులోకి రానున్నాయి. వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారికి త్వరలో మూడో టీకా డోసు (బూస్టర్ డోసు) కూడా రానుంది.
corona vaccine dose
target
single dose
double dose

More Telugu News