‘స్వాగ్ ఆఫ్ భోళా’... చిరు ఫ‌స్ట్ లుక్ వీడియో ఇదిగో

01-01-2022 Sat 11:02
  • నూతన సంవత్సరం సంద‌ర్భంగా విడుద‌ల
  • 18 క్ష‌ణాల నిడివితో వీడియో
  • చిరు లుక్ అదుర్స్‌
SWAG of BHOLAA Mega Star Chiranjeevis
నూతన సంవత్సరం సంద‌ర్భంగా 'భోళా శంక‌ర్‌' చిత్ర బృందం ఓ ప్ర‌త్యేక వీడియో విడుద‌ల చేసింది. ఇందులో చిరంజీవి చాలా స్టైలిష్‌గా క‌న‌ప‌డుతున్నారు. చేతికి తాయ‌త్తులు క‌ట్టుకుని, కొత్త హెయిర్ స్టైల్‌తో, గూగుల్స్ పెట్టుకుని, చిరంజీవి క‌న‌ప‌డుతోన్న తీరు అల‌రిస్తోంది.
                           
మరోపక్క, చిరంజీవి ఇప్పటికే 'ఆచార్య' చిత్రాన్ని పూర్తిచేశారు. ఆ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు ఆ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ వ‌స్తోంటే.. మ‌రోవైపు 'భోళా శంక‌ర్‌' చిత్ర బృందం కూడా ఈ స‌ర్‌ప్రైజ్ లుక్ విడుద‌ల చేయ‌డంతో చిరు అభిమానులు ఖుషీ అవుతున్నారు. 18 క్ష‌ణాల పాటు ఉన్న ఈ వీడియోను 'భోళా శంక‌ర్ సినిమా ఏ రేంజ్‌లో ఉండ‌నుందో తెలిపేలా రూపొందించారు దర్శకుడు మెహ‌ర్ ర‌మేశ్‌.

న్యూ ఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోళా’ అంటూ ఈ వీడియోను విడుదల చేశారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో చిరుకి జోడీగా తమన్నా న‌టిస్తోంది. ఈ సినిమాలో చిరుకి కీర్తి సురేశ్  సోదరిగా కనపడ‌నుంది. ప్ర‌స్తుతం చిరంజీవి వ‌రుస‌గా సినిమాల‌కు సైన్ చేస్తూ దూసుకుపోతున్నారు.