Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 40 గుడిసెలు దగ్ధం

Fire Accident in Hyderabad 40 huts changed as ashes
  • చాదర్‌ఘాట్ సాయిబాబా ఆలయానికి సమీపంలో ఘటన
  • భారీ శబ్దంతో పేలిన రెండు గ్యాస్ సిలిండర్లు
  • భారీగా ఆస్తి నష్టం
హైదరాబాద్‌లో నిన్న జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 40 పూరి గుడిసెలు కాలి బూడిదయ్యాయి. అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసీ నది ఒడ్డున చాదర్‌ఘాట్ సాయిబాబా ఆలయానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటల ధాటికి గుడిసెల్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి.

ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Hyderabad
Fire Accident
Afzal Gunj
Chaderghat

More Telugu News