Ramam Raghavam: అతడు ఉదయిస్తే లోకం భగభగ... ఆర్ఆర్ఆర్ నుంచి 'రామం రాఘవం' గీతం విడుదల

Ramam Raghavam song from RRR out now
  • ఆర్ఆర్ఆర్ నుంచి మరో పాట విడుదల
  • కీరవాణి సంగీతంలో రామం రాఘవం పాట
  • సంస్కృతంలో లిరిక్స్
  • సాహిత్యం అందించిన శివదత్త

ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి మరో రోమాంఛక గీతం విడుదలైంది. సీతారామరాజు పాత్రను ఎలివేట్ చేస్తూ సాగే రామం రాఘవం గీతాన్ని చిత్రబృందం యూట్యూబ్ లో పంచుకుంది. సంస్కృతంలో సాగే ఈ పాటకు కీరవాణి తండ్రి కె.శివదత్త సాహిత్యం అందించారు.

దీనిపై రాజమౌళి స్పందిస్తూ, అతడు ఉదయిస్తే లోకాన్ని భగభగలాడిస్తాడంటూ పేర్కొన్నారు. కీరవాణి సంగీతంలో రూపుదిద్దుకున్న ఈ పాటను విజయ్ ప్రకాశ్, చందన బాలకల్యాణ్, చారు హరిహరన్ పాడారు. ఈ పాటను కీరవాణి సెమీ క్లాసికల్, ఫూజన్ తరహాలో స్వరపరిచారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News