Team India: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక

Team India for ODI Series against South Africa
  • గాయంతో వైదొలిగిన రోహిత్ శర్మ
  • వన్డే టీమ్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్
  • వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా
  • కేవలం ఆటగాడిగా జట్టులో కోహ్లీ
  • జట్టులో యువకులకు పెద్దపీట
  • శిఖర్ ధావన్ పునరాగమనం

దక్షిణాఫ్రికాతో త్వరలో జరిగే మూడు వన్డేల సిరీస్ కు టీమిండియాను ఎంపిక చేశారు. రోహిత్ శర్మ గాయంతో వైదొలగిన నేపథ్యంలో వన్డే టీమ్ కు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ప్రకటించారు. పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ప్రధానంగా యువకులకు పెద్దపీట వేశారు. రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు చోటు కల్పించారు.

ఇక, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. ధావన్ ఈ పర్యటనలో రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే... ఈ వన్డే జట్టులో విరాట్ కోహ్లీకి కేవలం ఆటగాడినే స్థానం కల్పించారు. టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ 2022 జనవరి 19 నుంచి జరగనుంది.

టీమిండియా సభ్యులు వీరే...
కేఎల్ రాహుల్ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్.

  • Loading...

More Telugu News