Balakrishna: శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన బాలకృష్ణ

Balakrishna watched Shyam Singharoy movie
  • నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ చిత్రం
  • డిసెంబరు 24న విడుదలైన సినిమా 
  • బాలకృష్ణ కోసం స్పెషల్ స్క్రీనింగ్
  • యూనిట్ కు అభినందనలు తెలిపిన బాలయ్య
నేచురల్ స్టార్ నాని హీరోగా పునర్జన్మల కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయగా, సాయిపల్లవి, కృతి శెట్టి కథానాయికలు. వెంకట్ బోయనపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ శ్యామ్ సింగరాయ్ చిత్రం డిసెంబరు 24న విడుదలైంది.

కాగా ఈ చిత్రాన్ని అగ్రహీరో నందమూరి బాలకృష్ణ కోసం నేడు ప్రత్యేకంగా ప్రదర్శించారు. హీరో నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమా వీక్షించిన బాలయ్య ఆద్యంతం ఆస్వాదించారు. బాగా చేశారంటూ హీరో నానితో పాటు చిత్రంలోని నటీనటులను, టెక్నీషియన్లను అభినందించారు. మంచి సినిమా తీశావంటూ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ను మెచ్చుకున్నారు.
Balakrishna
Shyam Singharoy
Special Screening
Nani
Tollywood

More Telugu News