Nagarjuna: మీసాలు దువ్వేస్తున్న అక్కినేని సోగ్గాళ్లు .. రేపు 'బంగార్రాజు' టీజర్ రిలీజ్!     

Bangarraju Movie Update
  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు'
  • రొమాంటిక్ హీరోలుగా నాగ్, చైతూ
  • కథానాయికలుగా రమ్యకృష్ణ, కృతి శెట్టి
  • రేపు ఉదయం 11:22 నిమిషాలకు టీజర్ 
ఏఎన్నార్ కి రొమాంటిక్ హీరోగా మంచి క్రేజ్ ఉండేది. నటనలోనే కాకుండా ఆ తరహా క్రేజ్ విషయంలోను నాగార్జున వారసత్వాన్ని కొనసాగించారు. ఆ మధ్య వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో 'బంగార్రాజు' పాత్రలో కూడా రొమాంటిక్ హీరోగా ఆయన మరోసారి రెచ్చిపోయారు. ఇప్పుడు ఆ పేరునే టైటిల్ గా చేసుకుని సినిమాను పూర్తిచేశారు.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ కానుకగా టీజర్ ను రిలీజ్ చేయడానికి డిసైడయ్యారు. రేపు ఉదయం 11:22 నిమిషాలకు టీజర్ ను వదలుతున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగార్జున - చైతూ ఇద్దరూ కూడా మీసం దువ్వుతూ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు.

కథాపరంగా ఈ సినిమాలో చైతూ బుల్లి బంగార్రాజుగా కనిపించనున్నాడు. ఇక పోస్టర్ చూస్తుంటే రొమాంటిక్ హీరోగా చైతూను ముందుకు నడిపించే ప్రయత్నమేదో నాగ్ బలంగానే చేసినట్టుగా అనిపిస్తోంది. నాగ్ సరసన రమ్యకృష్ణ అలరించనుండగా, చైతూ జోడీగా కృతి శెట్టి సందడి చేయనుంది. త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పే అవకాశాలు ఉన్నాయి..
Nagarjuna
Nagachaitanya
Krithi Shetty
Bangarraju Movie

More Telugu News