భార్యకు విడాకులిస్తున్నట్టు ప్రకటించిన అర్నాల్డ్ ష్వార్జ్ నెగర్

31-12-2021 Fri 17:03
  • 1986లో వివాహం చేసుకున్న అర్నాల్డ్, శ్రివర్
  • ఈ జంటకు నలుగురు సంతానం
  • 10 ఏళ్ల క్రితమే విడాకులకు దరఖాస్తు చేసుకున్న దంపతులు
Arnold Schwarzeneggar giving divorce to his wife
హాలీవుడ్ కండలవీరుడు, టెర్మినేటర్ అర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ కీలక ప్రకటన చేశారు. తన భార్య శ్రివర్ కు విడాకులిస్తున్నట్టు ప్రకటించారు. వీరిద్దరూ 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. దాదాపు పదేళ్ల క్రితమే విడాకుల కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరికి వారు విడివిడిగానే బతుకుతున్నారు.

వీరికి ఉన్న 400 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విభజించి సెటిల్ చేయడానికి కోర్టుకు ఇంత సమయం పట్టింది. అర్నాల్డ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. కాలిఫోర్నియా గవర్నర్ గా కూడా ఆయన బాధ్యతలను నిర్వహించారు. 2003 నుంచి 2011 వరకు గవర్నర్ గా పని చేశారు.