Somu Veerraju: నన్ను 'సారాయి వీర్రాజు' అంటున్న వారు ఏం తాగుతారో నాకు తెలుసు: సోము వీర్రాజు

Somu Veerraju replies to critics
  • మద్యం రూ.50కే అమ్ముతామన్న సోము వీర్రాజు
  • ఏపీలో తమను గెలిపించాలంటూ పిలుపు
  • దిగజారిపోయాడంటూ విపక్షాల విమర్శలు 
  • ఘాటుగా స్పందించిన సోము

ఏపీలో తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం క్వార్టర్ రూ.50కే అందిస్తామంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. పలువురు నేతలు సోము వీర్రాజును 'సారాయి వీర్రాజు' అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు.

తనను 'సారాయి వీర్రాజు' అంటున్న వారు ఏం తాగుతారో తనకు తెలుసని అన్నారు. "నాపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము వరకు ఏం చేస్తారు?" అని ప్రశ్నించారు. తాను పేదవాడిని దృష్టిలో ఉంచుకునే మద్యం గురించి మాట్లాడానని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఏపీలోని ప్రతి సమస్యకు బీజేపీ వద్ద పరిష్కారం ఉందన్న కోణంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News