Ram Gopal Varma: త్వరలోనే 'వైరస్ చానల్' కూడా వస్తుందేమో!: వర్మ చమత్కారం

  • ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం
  • రెండేళ్లుగా పలు రూపాల్లో విజృంభిస్తున్న మహమ్మారి
  • ప్రస్తుతం ఒమిక్రాన్ రూపుదాల్చిన కరోనా
  • తనదైన శైలిలో స్పందించిన రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma comments on viral infections and a virus channel

గత రెండేళ్లుగా యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి ధాటికి అతలాకుతలం కావడం తెలిసిందే. 2019 చివర్లో చైనాలో వెలుగు చూసిన కరోనా రక్కసి పలు విధాలుగా రూపాంతరం చెందుతూ అనేక వేరియంట్లుగా విరుచుకుపడుతోంది. తాజాగా ఒమిక్రాన్ రూపు దాల్చిన కరోనా... అనేక దేశాల్లో శరవేగంగా వ్యాపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల్లో తరచుగా భిన్న రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు చోటుచేసుకుంటున్న తరుణంలో తనకో ఆలోచన వచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే వాతావరణ వివరాలు తెలిపేందుకు 'వెదర్ చానల్' ఉందని, ఇప్పుడు రకరకాల వైరస్ ల వివరాలు తెలిపేందుకు త్వరలోనే 'వైరస్ చానల్' కూడా వస్తుందేమోనని చమత్కరించారు.

More Telugu News