Ramcharan: రూ.100 కోట్ల పారితోషికంపై రామ్ చరణ్ స్పందన

Ram Charan Clarity On Rs 100 Crore Remuneration
  • అన్ని డబ్బులు ఎక్కడున్నాయంటూ ప్రశ్న
  • ఉన్నా ఎవరిస్తారన్న చెర్రీ
  • అవన్నీ వట్టి పుకార్లేనంటూ క్లారిటీ
వరుస సినిమాలతో రామ్ చరణ్ బిజీ బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవితో చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలోనూ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ కూడా ఇప్పటికే జరిగింది.

అయితే, ఆ తదుపరి సినిమాకు సంబంధించి చరణ్ రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానిపై చెర్రీ క్లారిటీ ఇచ్చాడు. అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి? అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఉన్నా తనకెవరిస్తారంటూ పుకార్లకు చెక్ పెట్టేశాడు.
Ramcharan
Tollywood
Remuneration
RRR

More Telugu News