David Warner: ‘నీ యవ్వ తగ్గేదేలె’ అంటూ వార్నర్ హల్ చల్.. రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదిగో వీడియో

David Warner Another Dub Video Of Pushpa Mesmerizes Fans
  • పుష్ప.. పుష్పరాజ్ అంటూ వార్నర్ వీడియో
  • ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వైనం
  • వార్నర్ తగ్గేదేలె అంటూ బన్నీ కామెంట్
  • భారత పౌరసత్వం తీసుకోవాలంటూ అభిమానుల సూచన
  • తానేం చేయాలంటూ అడిగిన వార్నర్
డేవిడ్ వార్నర్.. ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ కు ఇండియా అన్నా.. మన సినిమాలన్నా.. ప్రత్యేకించి తెలుగు సినిమాలన్నా ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి తెలుగు డైలాగ్ చెప్పేసి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బుట్ట బొమ్మసాంగ్ కు ఆడిపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. తాజాగా ‘పుష్ప’ అవతారమెత్తేశాడు.

ఇప్పటికే ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఉర్రూతలూగించిన వార్నర్.. మళ్లీ ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే’ అంటూ హల్ చల్ చేశాడు. ఇన్ స్టాలో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ ఆ వీడియోకు రిప్లై ఇచ్చాడు. ‘డేవిడ్ వార్నర్.. యవ్వ తగ్గేదేలె’ అంటూ కామెంట్ చేశాడు. రవీంద్ర జడేజా కూడా దానిపై కామెంట్ పెట్టాడు. తనంత మంచోడైతే కాదంటూ వ్యాఖ్యానించాడు.

కొందరు అభిమానులు వార్నర్ వీడియోకు ఆసక్తికర కామెంట్లు పెట్టారు. భారత పౌరసత్వం తీసుకోవచ్చు కదా? అని ఓ అభిమాని అడగ్గా.. అందుకు తానేం చేయాలో చెప్పాలంటూ వార్నర్ బదులుగా ప్రశ్నించాడు. చాలా మంది అభిమానులు పెట్టిన కామెంట్లకు అతడూ సరదాగా కామెంట్లు పోస్ట్ చేశాడు.
David Warner
Pushpa
Allu Arjun
Cricket
Tollywood
Australia

More Telugu News