Andhra Pradesh: ఏపీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు!

One more Omicron case found in Andhra Pradesh
  • ప్రకాశం జిల్లాలో ఒక మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ
  • 17కు చేరిన మొత్తం ఒమిక్రాన్ కేసులు
  • భారత్ లో 1,270కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదయింది. ఒక మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది. బాధిత మహిళతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారికి కరోనా పరీక్షలను నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు.

మరోవైపు నిన్న ఏపీలో 130 మందికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తం కరోనా కేసులు 20,74,084కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 14,493 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే, ఇప్పటి వరకు మొత్తం 1,270 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు 62కి పెరిగాయి.
Andhra Pradesh
Omicron
Woman
Corona Virus

More Telugu News