Samantha Ruth Prabhu: ‘అందమైన అమ్మాయి’ పాత్రలు చేసిచేసి అలసిపోయాను: సమంత

I was tired of playing the cute girl in films
  • దక్షిణాదిన మంచి స్థానం దక్కింది
  • అందుకే బాలీవుడ్ కు దూరమయ్యాను
  • రీమేక్ పాత్రల పట్ల ఆసక్తి లేదు
  • మంచి అవకాశాలు వస్తే నిరూపించుకునే సత్తా ఉంది

నాగచైతన్యతో వైవాహిక బంధానికి పుల్ స్టాప్ పెట్టిన నటి సమంత.. బాలీవుడ్ లో అవకాశాలపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఇటీవలే ఆమె మనోజ్ బాజ్ పేయితో ఒక వెబ్ సిరీస్ లో నటించడం తెలిసిందే. తాజాగా ఒక వార్తా సంస్థతో మాట్లాడింది.

‘‘వెబ్ సిరీస్ చేయాలన్న ఆలోచన అసలు లేదు. కానీ రాజ్ నిడిమోరు, డీకే కృష్ణ నా ఆలోచనలో మార్పు తెచ్చారు. కుదరదు అని చెప్పకూడదని నేర్చుకున్నాను. నేను కోరుకున్న దానికంటే ఎక్కువ అభినందనలు అందుకున్నాను. నూతన సవాళ్లను స్వీకరించగలననే నమ్మకం ఏర్పడింది’’ అని చెప్పింది సమంత.  

బాలీవుడ్ కు చాలా కాలంగా దూరంగా ఎందుకు ఉన్నారు? అన్న ప్రశ్నకు.. దక్షిణాదిలో మంచి స్థానం లభించడమే దీనికి కారణంగా పేర్కొంది. ‘‘నేను ఇప్పటికీ ఎంపిక పరంగా తప్పులు చేస్తున్నాను. సంతృప్తినిచ్చే పాత్రలు చేయడం లేదు. కానీ గత రెండేళ్లలో పరిస్థితులు మారాయి. సవాళ్లను స్వీకరించగలనన్న నమ్మకం ఇప్పుడు నాకు కలిగింది. ప్రతిదీ ప్రయత్నించి ఫలితం ఏంటా అని చూసే రకం కాదు నేను. ఒక దాని తర్వాతే మరొకటి. అందుకే ఇంత గ్యాప్ వచ్చింది’’ అంటూ చెప్పింది.

ఇప్పటి వరకు మూసధోరణి తరహా పాత్రలు చేస్తున్న నటులకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లను మంచి అవకాశాల వేదికలుగా సమంత పేర్కొంది. ‘‘అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసిచేసి అలసిపోయాను. ఇకమీదట ఆ పాత్రలను చేయడానికి నేను సమర్థురాలుని కాదని నమ్ముతున్నాను. నా వంటి నటులకు మంచి అవకాశం వస్తే నిరూపించుకునే సామర్థ్యం ఉంది’’ అంది సమంత.

‘‘తాను గతంలో కొన్ని రీమేక్ చిత్రాలు చేశానని.. ఇక మీదట రీమేక్ పాత్రల పట్ల ఆసక్తి లేదని సమంత స్పష్టం చేసింది. ‘‘మంచి స్క్రిప్టులు నా కోసం వేచి చూస్తున్నాయి. రీమేక్ బదులు వాటిని ఎంపిక చేసుకుని ముందుకు వెళతాను’’అని పేర్కొంది.

  • Loading...

More Telugu News