సంక్రాంతి తరువాతనే 'సలార్' షెడ్యూల్!

31-12-2021 Fri 10:13
  • రిలీజ్ కి రెడీగా 'రాధేశ్యామ్'
  • జనవరి 14న థియేటర్లకు
  • షూట్ పూర్తి చేసుకున్న 'ఆది పురుష్'
  • ముగింపు దశలో 'సలార్'
Salaar movie update
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తుండగా, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఒక వైపున ఈ సినిమా షూటింగులో పాల్గొంటూనే ప్రభాస్ 'ఆది పురుష్'ను పూర్తి చేశాడు. 'సలార్' ను కూడా ముగింపు దశకి తీసుకుని వచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ 'రాధే శ్యామ్' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తరువాతనే .. అంటే సంక్రాంతి పండుగ తరువాతనే మళ్లీ 'సలార్' తాజా షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. 'ఆది పురుష్'లో శ్రీరాముడిగా .. 'రాధేశ్యామ్'లో రొమాంటిక్ హీరోగా కనిపించనున్న ప్రభాస్, 'సలార్'లో తన ఇమేజ్ కి తగిన మాస్ యాక్షన్ లుక్ తో కనిపించనున్నాడు.