Revanth Reddy: రేవంత్ రెడ్డి మరోసారి హౌస్ అరెస్ట్

Revanth Reddy house arrest
  • జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ గృహ నిర్బంధం
  • పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు
  • భూపాలపల్లి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న వైనం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి బయటకు రాకుండా ఆయనను నిర్బంధించారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటికి వెళ్లే అన్ని మార్గాల్లో బ్యారికేడ్లు పెట్టారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

ఇటీవలే కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రేవంత్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోజు ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులకు, వారికి మధ్య తోపులాట కూడా జరిగింది. ఆ తర్వాత రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Revanth Reddy
Congress
House Arrest

More Telugu News