Andhra Pradesh: 36 మంది డీఎస్పీలకు పదోన్నతి కల్పించిన ఏపీ ప్రభుత్వం

36 DSPs got promotion as ASPs in AP
  • 36 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి
  • వీరిలో ఇప్పటికే అడ్ హాక్ పద్ధతిలో అడిషనల్ ఎస్పీలుగా పని చేస్తున్న ఐదుగురు
  • 15 రోజుల్లోగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం

36 మంది సివిల్ డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ఏపీ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరిలో ఐదుగురు (ఏవీ సుబ్బరాజు, కె.శ్రీలక్ష్మి, జి.స్వరూపారాణి, ఇ.నాగేంద్రుడు, సి.జయరామరాజు) 2020 నుంచి అడ్ హాక్ పద్ధతిలో ఇప్పటికే అడిషనల్ ఎస్పీలుగా పని చేస్తున్నారు. అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందిన 36 మంది మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో 15 రోజుల్లోగా రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఇన్ ఛార్జ్ ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.

  • Loading...

More Telugu News