Varla Ramaiah: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై వెంటనే చర్యలు తీసుకోండి: వర్ల రామయ్య

Varla Ramaiah demands action on Undavalli Sridevi
  • అంబేద్కర్ వల్ల వచ్చిందేమీ లేదన్న శ్రీదేవి
  • అంబేద్కర్ పై తొలి నుంచి వైసీపీ నేతలు అయిష్టతను చూపుతున్నారన్న వర్ల
  • శ్రీదేవి వ్యాఖ్యలు శిక్షార్హమన్న టీడీపీ నేత
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్ల వచ్చిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ ఉండవల్లి శ్రీదేవిపై మండిపడ్డారు.

తొలి నుంచి కూడా అంబేద్కర్ అంటే వైసీపీ నేతలు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ ను ఆ పార్టీ ముఖ్య నేతలు కించపరచడం చాలా సార్లు చూశామని చెప్పారు. ఇప్పుడు అంబేద్కర్ ను శ్రీదేవి కించపరిచారని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు శిక్షార్హమని... ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Varla Ramaiah
Telugudesam
Undavalli Sridevi
Ambedkar

More Telugu News