Nani: 'అంటే .. సుందరానికీ' నుంచి జీరోత్ లుక్!

Anate Sundaraniki Zeroth Look released on 1st Jan
  • వినోదమే ప్రధానంగా 'అంటే సుందరానికీ'
  • నాని సరసన నాయికగా నజ్రియా 
  • సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్
  • జనవరి 1వ తేదీన ఫస్టులుక్
నాని కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్'కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తూ ఉండగానే, నాని తదుపరి సినిమా అయిన 'అంటే .. సుందరానికీ' ప్రాజెక్టులో కదలిక మొదలైంది. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు.

న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుంచి జనవరి 1వ తేదీ 4:05 నిమిషాలకు జీరోత్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కె పి వి ఎస్ ఎస్ పి ఆర్ సుందర ప్రసాద్ పాత్రను పరిచయం చేయనున్నట్టుగా చెప్పారు. అంటే మన కథానాయకుడు సుందరానికి ఇది అసలుపేరు అనుకోవాలి.

అంతా బాగానే ఉందిగానీ మరి జీరోత్ లుక్ అంటూ ఈ కొత్త ప్రయోగం .. కొంత సస్పెన్స్ వెనుక క్రియేటివిటీ ఏమిటనేదే చూడాలి. సినిమాలో నాని జోడీగా నజ్రియా నజీమ్ కనువిందు చేయనుంది. ఈ మలయాళ బ్యూటీ తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే. వివేక్ సాగర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అని చెబుతున్నారు.  
Nani
Nazriya
Ante Sundaraniki Movie

More Telugu News