pm: ప్రధాని మోదీ ఒక పని ప్రారంభిస్తే.. పూర్తయ్యే వరకు విశ్రమించరు: ఆసక్తి రేపుతున్న శరద్ పవార్ వ్యాఖ్యలు

pm modi is strong on administartion sarad pawar
  • పాలనపై చక్కని పట్టు
  • అదే ఆయన బలం
  • మాజీ ప్రధానుల్లో ఇది కనిపించదు
  • తన అభిప్రాయాలను వెల్లడించిన పవార్

దేశ రాజకీయ రంగంలో శరద్ పవార్ ఎంతో సీనియర్. ఆయన చేసే వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇతర పార్టీ నేతలను విమర్శించడమే కాదు.. తనకు నచ్చితే మెచ్చుకోవడానికి ఆయన తటపటాయించరు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆయన చెప్పిన అభిప్రాయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీకి పాలనపై పట్టుందని, అదే ఆయన బలమని శరద్ పవార్ అన్నారు. పూణెలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా పవార్ మాట్లాడారు. ప్రధాని తాను ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసే విషయంలో అధికారులు, మంత్రులను ఒక్కతాటిపైన నడిపిస్తారని పవార్ చెప్పారు. ‘‘ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు మోదీ విడిచిపెట్టరు. ఈ తరహా విధానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల్లో కనిపించదు’’ అని పవార్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News