పవన్ కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేసిన బోయపాటి?

30-12-2021 Thu 11:13
  • 'అఖండ'తో హిట్ కొట్టిన బోయపాటి 
  • నెక్స్ట్ ప్రాజెక్టుకి అందుబాటులో లేని బన్నీ
  • మరో స్టార్ తో పట్టాలపైకి వెళ్లే ఆలోచన
  • పవన్ కి కథ వినిపించే ప్రయత్నాలు
Pavan in Boyapati Movie
బోయపాటి మొదటి నుంచీ కూడా యాక్షన్ .. ఎమోషన్ ను సమపాళ్లలో కలుపుకునే కథలను రెడీ చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన సినిమాల్లో మాస్ ఆడియన్స్ కి కావలసిన అంశాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వాళ్ల నుంచి ఆయన సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంటుంది.

'అఖండ'తో బాలయ్యకి తిరుగులేని హిట్ ఇచ్చిన బోయపాటి, తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడు. అయితే వెంటనే 'పుష్ప 2' పెట్టుకోవడం వలన బన్నీ అందుబాటులో ఉండటం లేదు. దాంతో మరో స్టార్ హీరోతో ముందుకు వెళ్లే ఆలోచనలో బోయపాటి ఉన్నాడని చెప్పుకుంటున్నారు.

అయితే లాక్ డౌన్ సమయంలో పవన్ కోసం బోయపాటి ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడట. మాస్ యాక్షన్ తో పాటు పొలిటికల్ టచ్ ఉండే ఈ కథను పవన్ కి వినిపించే ప్రయత్నంలో ఆయన ఉన్నాడని అంటున్నారు. పవన్ కి గనుక కథ నచ్చితే, క్రిష్ .. హరీశ్ శంకర్ .. సురేందర్ రెడ్డి ప్రాజెక్టుల తరువాత ఉండొచ్చని చెప్పుకుంటున్నారు.