శేఖర్ కమ్ముల కోరడంతో.. యువకుడి చికిత్సకు హరీశ్ రావు సాయం

30-12-2021 Thu 11:07
  • నిమ్స్ లో వైద్య చికిత్స
  • సీఎం సహాయ నిధి నుంచి రూ.7 లక్షల మంజూరు
  • ధన్యవాదాలు తెలిపిన శేఖర్ కమ్ముల
sekhar kammula helps to youth for medical treatment
దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ యువకుడి చికిత్సకు పరోక్షంగా సాయపడ్డారు. మంత్రి హరీశ్ రావుతో మాట్లాడి సాయం అందించడంలో తోడ్పడ్డారు. యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెంకు చెందిన హర్షవర్ధన్ ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకునే స్తోమత లేదన్న విషయం దర్శకుడు శేఖర్ కమ్ములకు తెలిసింది.

ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి శేఖర్ కమ్ముల తీసుకెళ్లి, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దీంతో హర్షవర్ధన్ కు నిమ్స్ లో చికిత్సకు హరీశ్ రావు ఏర్పాటు చేయించారు. అంతేకాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.7 లక్షల సాయం మంజూరు చేయించారు. దీనికి శేఖర్ కమ్ముల ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి హరీశ్ రావు దీన్ని రీట్వీట్ చేస్తూ.. యువకుడికి చికిత్స అందించిన నిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపారు.